Magazines

విద్యార్థులందరికీ షూ, సాక్స్, బెల్టులు

1 గంట క్రితం

students
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బూట్లు,సాక్స్, బెల్టులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు సంబంధిత పాఠశాలలకు వీటిని సరఫరా చేసింది.మండలంలోని 15 గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో  1505 మందికి విద్యార్థులు చదువుకుంటు న్నారు.వీరందరికి పంపిణీ చేశారు.అన్ని పాఠ శాలలకు ఒకే సారి కాకుండా దశల వారీగా పంపిణీ చేశారు.విద్యార్థులకు పంపిణీ చేసిన బూట్లు,సాక్సులు, బెల్టుల నాణ్యతపై పలువురు అను మానాలు వ్యక్తం చేస్తున్నారు.విద్యార్థులకు కొలతలతో సంబంధం లేకుండా పంపిణీ చేయటం గందర గోళానికి దారి తీసింది.పాదాలకు సంబంధించిన కొలతలు తీసుకో వాలి.ఇలా చేయకుండా నేరుగా పాఠశాలలకు కొలతలతో సంబంధం లేకుండా సరఫరా చేశారు.బూట్ల నాణ్యత కూడా అంతంత మాత్రంగానే ఉందనే ఆరోపణలున్నాయి.మండల కేంద్రంలో ఓ పాఠశాలకు వచ్చిన రోజే కుట్లు ఊడిపోయినట్లు తెలిసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్