Magazines

'సర్ సర్వేతో ఓట్లు తొలగించడం అన్యాయం.!

10 గంటల క్రితం

S.I.R
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

ఆర్టీఐ జిల్లా కోకన్వీనర్ కుమార్ యాదవ్

నవతెలంగాణ - మల్హర్ రావు

సర్ సర్వే పేరుతో ఓట్లను తొలగించడం అన్యాయమని యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ భూపాలపల్లి జిల్లా కోకన్వీనర్ చింతల కుమార్ యాదవ్ శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల సిబ్బంది తప్పిదంతో అమాయక ఓటర్లను జాబితా తొలగించి నోటీస్ లు జారిచేయడంపై ఓటర్లు అయోమయానికి గురివుతున్నట్లుగా వాపోయారు. కేంద్ర ఎన్నికల కమిషన్ వెంటనే సర్ ప్రక్రియను ఆపాలని డిమాండ్ చేశారు. నోటీస్ జారీ చేసిన ఏఓటరుకైన సంబంధించిన బిఎల్ఓ ఆ ఓటరు ఇంటికి వెళ్లి పత్రాలు సేకరించి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలనే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలు అమలు  కావడం లేదన్నారు. ఓటర్లు విచారణకు సంబంధించిన కార్యాలయానికి హాజరు కావాల్సిన అవసరం కూడా లేదనే నిబంధన ఆచరణకు నోచుకోవడం లేదన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్