Magazines

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వీడి రోడ్డు పనులు పూర్తి చేయాలి

1 గంట క్రితం

neglecting the work
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

కిషన్ రావు పల్లి నుంచి అటవీప్రాంతం మీదుగా భూపాలపల్లి వరకు నిర్మాణం చేస్తున్న రోడ్డు పనులపై గుత్తేదారు నిర్లక్ష్యం విడి పనులు వెంటనే పూర్తి చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఇందారపు సిద్దు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి రోడ్డు గుంతలమయం కావడంతో ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారిందని వాపోయారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ సేవలకు అంతరాయం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సంబంధించిన అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రహదారి నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురివుతున్నట్లుగా తెలిపారు. గుత్తేదారు జాప్యంతో ప్రజలకు శాపంలా మారిందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు.complete the road works.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్