నవతెలంగాణ-మిడ్జిల్ : మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో సోమవారం జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై నిర్వహించిన సామాజిక తనిఖీ సోషల్ ఆడిట మండల సభ ప్రజాప్రతినిధులు లేకుండానే తూతుమంత్రంగా ముగిసింది. ఉపాధి హామీ పథకంలో 2025 నుండి మార్చి వరకు జరిగిన అవకతవకలపై చర్చించాల్సిన కీలక సమావేశానికి ప్రజాప్రతినిధులు , ప్రజల భాగస్వామ్యం లేకపోవడంతో కేవలం అధికారులే మొక్కుబడిగా తనిఖీ కార్యక్రమాన్ని పూర్తి చేయడంతో మండల ప్రజలు అధికారుల తీరిపై మండిపడుతున్నారు.
ప్రజాప్రతినిధుల సమక్షంలో జరగాల్సిన ఆడిట్‌ను ఇలా ఏకపక్షంగా నిర్వహించడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో జరిగిన పనులలో గ్రామాల వారీగా వచ్చి సభ ఎదుట జరిగిన పనులపై వివరించారు. గ్రామాలలో ఎంత అవినీతి జరిగిందో అధికారులు చెప్పకుండానే సభ ముగించుకొని వెళ్ళిపోయారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ అడిషనల్ పిడి వామన్ రావు, ఏపీడి , ఎంపీడీవో లక్ష్మణ్, ఎంపీ ఓ రాజశేఖర్ రెడ్డి, ఏపీవో హైమావతి, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)