Magazines

ధాన్యం కొనుగోలు కేంద్రం మార్పు

17 నిమిషాల క్రితం

ashwaropet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

- మార్కెట్ యార్డులోనే ధాన్యం కొనుగోళ్లు

- రైతులు మార్పును గమనించి సహకరించాలి

- సొసైటీ అధ్యక్షుడు చిన్నంశెట్టి సత్యనారాయణ

నవతెలంగాణ - అశ్వారావుపేట

అశ్వారావుపేట సొసైటీ పరిధిలోని రైతుల ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ప్రదేశాన్ని ఈ ఏడాది మార్చినట్లు సొసైటీ అధ్యక్షుడు చిన్నంశెట్టి సత్యనారాయణ తెలిపారు. గతంలో కొనుగోళ్లు నిర్వహించిన ప్రదేశంలో కాకుండా, ఈసారి అశ్వారావుపేట మార్కెట్ యార్డులో,కెమిలాయిడ్స్ ఎదురుగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

గతంలో కొనుగోలు కేంద్రం నిర్వహించిన ప్రాంతాన్ని ప్రభుత్వం లోతట్టు ప్రాంతంగా గుర్తించిన నేపథ్యంలో ఈ మార్పు చేసినట్లు వివరించారు. సొసైటీ పరిధిలోని రైతులందరూ ఈ విషయాన్ని గమనించి తమ ధాన్యాన్ని మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర పొందేందుకు రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కొనుగోలు కేంద్రం మార్పుపై రైతులు అవగాహన కలిగి ఉండి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్