Magazines

వన సంరక్షణతో పాటు ఆర్థిక స్వావలంబన సాధించాలి

3 రోజుల క్రితం

forest
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

- సత్తుపల్లి అటవీ రేంజ్ అధికారి యల్లయ్య

- సత్తుపల్లి, తల్లాడ  రేంజ్‌  వీఎస్ఎస్ సభ్యులు, అటవీ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

నవతెలంగాణ-సత్తుపల్లి 

వన సంరక్షణ సమితి (వీఎస్ఎస్) సభ్యులు కేవలం అడవుల రక్షణకే పరిమితం కాకుండా, అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ జీవనోపాధుల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సత్తుపల్లి అటవీ రేంజ్ అధికారి యల్లయ్య అన్నారు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వన సంరక్షణ సమితి సభ్యులు, అటవీ క్షేత్రస్థాయి సిబ్బందికి క్షేత్రస్థాయి సాంకేతిక ఆవిష్కరణలు, జీవనోపాధుల అభివృద్ధి,  ఆర్థిక స్వావలంబన అంశాలపై సత్తుపల్లి, తల్లాడ ఏర్పాటుచేసిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.


అడవుల పరిరక్షణలో వీఎస్ఎస్ సభ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా, చట్టబద్ధంగా అటవీ వనరులను వినియోగించుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలను అందిపుచ్చుకుని, స్థానికంగా లభించే అటవీ ఉత్పత్తుల ఆధారంగా వివిధ స్వయం ఉపాధి మార్గాలను అభివృద్ధి చేసుకోవాలని వివరించారు. తద్వారా కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుని స్వావలంబన దిశగా అడుగులు వేయాలని తెలిపారు. ​అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది కూడా సమితి సభ్యులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నిరంతర శిక్షణ,  సరైన మార్గదర్శకత్వం అందిస్తూ వారి ఆర్థిక ప్రగతికి తోడ్పడాలని కోరారు. అడవుల సంరక్షణతో పాటు గ్రామీణ ప్రజల ఆర్థిక అభివృద్ధి సాధ్యమైనప్పుడే స్థిరమైన వన సంరక్షణ సాకారమవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తల్లాడ రేంజ్ అధికారి ఉమ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ప్రతినిధులు రాహుల్ ప్రకాష్, జోగేంద్ర పాత్రో, దివ్యాన్షు, అటవీ శాఖ సిబ్బంది, వన సంరక్షణ సమితి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్