Magazines

బిల్కిస్‌ బానో కేసులో సుప్రీం తీర్పు దిగ్భ్రాంతికరం

15 నిమిషాల క్రితం

Supreme Cour
avatar
balaji

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం

దోషులకు బెయిల్‌ తీవ్ర అభ్యంతరకరం : సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంఎ బేబీ

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బిల్కిస్‌ బానోపై సామూహిక లైంగికదాడి, హత్యల కేసులో దోషులుగా తేలిన 11 మందిలో ఇద్దరు దీర్ఘకాలంగా జైల్లో ఉన్నారనే కారణంతో శిక్షను నిలిపివేసి బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులు దిగ్భ్రాంతికరమైనవని, ఖండించదగినవని సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంఎ బేబీ పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న ఎక్స్‌లో స్పందించారు. ఏండ్ల తరబడి విచారణ లేకుండా జైళ్లల్లో మగ్గుతున్న యువ కార్యకర్తలకు బెయిల్‌ విషయంలో ముందుకు రాని సుప్రీంకోర్టు, అత్యంత ఘోరమైన నేరాలకు పాల్పడినట్లు నిర్ధారణైన దోషులను విడుదల చేయడం సమంజసం కాదని విమర్శించారు. 2022లో గుజరాత్‌ ప్రభుత్వం నుంచి శిక్షా ఉపశమనం పొందేందుకు ఈ దోషులు న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేసినట్లు సుప్రీంకోర్టే గతంలో పేర్కొందని గుర్తుచేశారు. వారికి ఇప్పటికే పలుమార్లు పెరోల్‌, ఫర్లౌ సెలవులు కూడా లభించాయని తెలిపారు. ఈ వ్యవహారంలో బాధితురాలికి న్యాయం చేయడంలో సుప్రీంకోర్టు విఫలమైందని విమర్శించారు. బిల్కిస్‌ బానో న్యాయ పోరాటం ఆమెకు మాత్రమే సంబంధించినది కాదని, న్యాయం కోరే ప్రతి ఒక్కరికీ సంబంధించినదని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్