- పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలి
- 2026 డిశెంబర్ 15 నుండి నిరవధిక సమ్మె
- సీఐటీయూ జిల్లా కోశాధికారి జి.భాస్కర్
నవతెలంగాణ - తొగుట
ఆశా కార్యకర్తలకు రూ.18 వేలు ఫిక్స్ డ్ వేతనం ఇవ్వలని సీఐటీయూ జిల్లా కోశాధికారి జి.భాస్కర్ డిమాండ్ చేశారు. మంగళవారం ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను అమలు చేయా లని కోరుతు మండల కేంద్రంలో వైద్య అధికారి డాక్టర్ రాధాకిషన్ కు ఆశాలతో కలిసి సమ్మె నోటీసు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ..రాష్ట్రంలో ఆశా కార్యకర్తలు 28 వేల మంది గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారని అన్నా రు. వీరంతా బడుగు, బలహీన వర్గాలకు సేవలం దిస్తున్నారనీ, గర్భిణీలు ఆసుపత్రిలో డెలివరీ అయ్యే విధంగా చూస్తూన్నారని తెలిపారు.
తల్లి, బిడ్డ ప్రాణాలను కాపాడటంలో కీలకపాత్ర పోషి స్తున్నారనీ చెప్పారు. సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని వివరించారు. ఆశాలకు సెంటర్ డ్యూటీలు, ఏఎన్సీ, పిఎన్సి, టార్గెట్స్, ఎన్సిడి ఆన్లైన్ సర్వే, స్పూటమ్ డబ్బాలను మోయడం, ఎగ్జామ్ డ్యూటీలు, డ్రైడే ఫ్రైడే, లెప్రసీ, పల్స్ పోలియో తదితర అనేక పనులు ఉదయం నుండి రాత్రి వరకు చేస్తున్నారని గుర్తు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆశా లకు రూ. 18 వేల వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో ఆశా యూనియన్ సిద్ధిపేట జిల్లా కార్య దర్శి బీ. ప్రవీణ, పుష్పలత, లక్ష్మీ, శారద, భాగ్య లక్ష్మి, రాజకళ, శ్వేత, కవిత, సాజిద, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)