నవతెలంగాణ-మర్రిగూడ
ప్రభుత్వం అందించే సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం నిరుపేదలకు వరం లాంటిదని కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన 19 లక్షల 50 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 39 మంది లబ్ధిదారులకు ఆయా గ్రామాల సర్పంచుల సమక్షంలో అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, మండల మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ సర్పంచ్ లు, ఎంపిటిసిలు, మార్కెట్ చైర్మన్ లు, డైరెక్టర్లు, మండల కమిటీ సభ్యులు, మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)