Magazines

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా..ఆన్‌లైన్‌ నమోదును పరిశీలించిన ఎంపీఓ

49 నిమిషాల క్రితం

online registration
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

- జిల్లాలో 34,563 కుటుంబాల నమోదు పూర్తి

- 482 శిబిరాలకు 278 చోట్ల సర్వే ప్రారంభం

- ఇంకా ప్రారంభం కాని శిబిరాలు 204

- అశ్వారావుపేటలో 1,034 కుటుంబాల నమోదు

నవతెలంగాణ - అశ్వారావుపేట

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామీణ స్థానిక సంస్థల పరిధిలో కుటుంబాల వివరాల సేకరణ, నమోదు కోసం మొత్తం 482 శిబిరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటివరకు 278 శిబిరాల్లో సర్వే ప్రారంభమైంది. మరో 204 శిబిరాల్లో సర్వే ప్రారంభం కావాల్సి ఉంది.

నవంబర్ 24వ తేదీ నాటికి జిల్లావ్యాప్తంగా 34,563 కుటుంబాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. అలాగే గత రోజుతో పోలిస్తే శిబిరాల సంఖ్యలోనూ ఎలాంటి పెరుగుదల లేదు.


అశ్వారావుపేట మండలంలో మొత్తం 27 శిబిరాలను గుర్తించగా, తొమ్మిది శిబిరాల్లో మాత్రమే సర్వే ప్రారంభమైంది. ఈ శిబిరాల ద్వారా ఇప్పటివరకు 1,034 కుటుంబాల వివరాలను నమోదు చేశారు. ఇంకా 18 శిబిరాల్లో సర్వే ప్రారంభం కావాల్సి ఉంది.

దమ్మపేట మండలంలో 31 శిబిరాలకు గాను 22 ప్రారంభమై 2,697 కుటుంబాల నమోదు పూర్తయింది. చంద్రుగొండలో 14 శిబిరాలూ ప్రారంభమై 2,607 కుటుంబాల వివరాలు నమోదు కాగా, ములకలపల్లిలో 20 శిబిరాలకు గాను ఏడు ప్రారంభమై 1,406 కుటుంబాల నమోదు జరిగింది.


జిల్లాలో అత్యధికంగా టేకులపల్లిలో 4,112, ఇల్లందులో 3,959, బూర్గంపాడులో 2,610 కుటుంబాల వివరాలు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఇంకా 204 శిబిరాలు ప్రారంభం కావాల్సి ఉండటంతో నమోదు ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్