- మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ స్పష్టం
- 29న అల్గునూర్ లో దీక్షా దివాస్ స్పూర్తిసభ
నవతెలంగాణ - బెజ్జంకి
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అన్ని విధాలుగా దోపిడీకి గురవ్వడంతో తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం చారిత్రాత్మకమైందని..నాడు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై పన్నిన కుట్రలను తిప్పికొట్టింది..కరీంనగర్ గడ్డపై కేసీఆర్ చేపట్టిన దీక్షా దీవాసేనని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
మంగళవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన పాత్రికేయ సమావేశంలో బోయినిపల్లి వినోద్ కుమార్ మాజీ ఎమ్మెల్యే రసమయి, బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లాధ్యక్షుడు జీవీ రామక్రిష్ణ రావు, మండలాధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డితో కలిసి మాట్లాడారు. కేసీఆర్ సచ్చుడో..తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ చేపట్టిన దీక్షా దీవాస్ ప్రాముఖ్యతను నేటి తరానికి తెలియజేయడానికి ఈ నెల 29న అల్గూనూర్ గ్రామంలో నిర్వహించనున్న దీక్షా దీవాస్ స్పూర్తి సభకు మండలంలోని తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున హజరై విజయవంతం చేయాలని కోరారు. మండల బీఆర్ఎస్ శ్రేణులు హజరయ్యారు.






కామెంట్లు (0)