Magazines

సింగరేణి ఏరియాలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

21 నిమిషాల క్రితం

Constitution Day
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

- ​రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా బాధ్యతలు నిర్వర్తించాలి: ఏరియా జీఎం సరికొండ వెంకటాచారి

నవతెలంగాణ-సత్తుపల్లి

 సింగరేణి ​సత్తుపల్లి ఏరియాలోని జనరల్ మేనేజర్ కార్యాలయంలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏరియా జీఎం సరికొండ వెంకటాచారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు, గనులు, విభాగాల అధిపతులు, అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


ఈ సందర్భంగా హాజరైన వారందరూ సామూహికంగా భారత రాజ్యాంగ పీఠికను పఠించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి మౌలిక విలువలను గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జీఎం వెంకటాచారి మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం పట్ల గౌరవం కలిగి ఉండాలన్నారు.

హక్కులతో పాటు విధులను కూడా గుర్తించి, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా తమ బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు.

ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశ అభివృద్ధికి అందరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్