ఎన్పీడీసీఎల్ ఎస్ఇ అల్జాపూర్ రమేష్
నవతెలంగాణ-ముధోల్
విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సబ్‌స్టేషన్లపై లోడ్‌ను తగ్గించి, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ముధోల్, తరోడ సబ్‌స్టేషన్లలో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల (పీటీఆర్) సార్థ్యాన్ని పెంచిన్నట్లు ఎన్పీడీసీఎల్ ఎస్సీ అల్జాపూర్ రమేష్ అన్నారు. ముధోల్ సబ్‌స్టేషన్‌లో ఇప్పటికే ఉన్న 5 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి, దాని స్థానంలో 8 ఎంవీఏ సామర్థ్యం కలిగిన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు.
తరోడ సబ్‌స్టేషన్‌లో ఇప్పటికే ఉన్న 8 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌కు అదనంగా 5 ఎంవీఏ సామర్థ్యం కలిగిన మరో ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగించారు. వీటిని గురువారం సాయంత్రం ఎస్ఇప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపుతో విద్యుత్ లోడ్ సమస్యలు తగ్గి, వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందనుందని ఆయన తెలిపారు.
అధిక విద్యుత్ వినియోగ సమయాల్లో సబ్‌స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు చెప్పారు.ఈకార్యక్రమంలో బైంసా ఎన్పీడీసీఎల్ డిఇ తిలక్ నాయక్,ఏడిఈ ఎం ఆర్ టి రమేష్,ముధోల్ ఎఇ శ్రీకాంత్, సబ్ ఇంజనీర్ పాషా, లైన్ మెన్ లు పోతుల వార్ జగదీష్, దస్వంత్ , లైన్ ఇన్స్పెక్టర్ బాసిద్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)