Magazines

‘సంవిధాన్ రక్షా మార్చ్’కు భారీగా తరలిన సత్తుపల్లి కాంగ్రెస్ శ్రేణులు

9 నిమిషాల క్రితం

Samvidhan Raksha March
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి

 భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘సంవిధాన్ రక్షా మార్చ్’ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ పాల్గొన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా హైదరాబాద్‌కు తరలివెళ్లారు.


మార్గమధ్యలో ఖమ్మం పట్టణంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు సాగిన మార్చ్‌లో డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, సత్తుపల్లి శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని సంఘీభావం తెలిపారు.


ఈ సందర్భంగా డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ మాట్లాడుతూ... రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్య విలువలను భావితరాలకు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ గడ్డం ఇందుప్రియతో పాటు సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మహిళా, యూత్ కాంగ్రెస్ నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.


రాజ్యాంగ పరిరక్షణ కోసం నిర్వహించిన ఈ మార్చ్‌లో సత్తుపల్లి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఐక్యతను, పార్టీ పట్ల నిబద్ధతను చాటిచెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్