- బీపీసీఎల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ జెండా ఆవిష్కరించిన ఎర్ర అశోక్
నవతెలంగాణ-నాచారం: కార్మికుల హక్కుల పరిరక్షణకు సంఘటిత పోరాటాలే మార్గమని సీఐటీయూ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర అశోక్ అన్నారు. చర్లపల్లి పారిశ్రామికవాడలోని బీపీసీఎల్ పరిశ్రమలో నూతనంగా ఏర్పాటు చేసిన బీపీసీఎల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జెండాను గురువారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం యూనియన్ అధ్యక్షుడు, సీఐటీయూ జిల్లా కోశాధికారి పి.గణేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎర్ర అశోక్ మాట్లాడుతూ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నెలకు రూ.42 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. శాశ్వత ఉద్యోగులతో సమానంగా వేతనాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని, ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రతి కార్మికుడికి ఈఎస్‌ఐ, పీఎఫ్, ప్రమాద బీమా, ప్రసూతి సెలవులు అమలు చేయడంతో పాటు నెలవారీ వేతనాలను ప్రతినెలా ఒకటో తేదీన బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి జి.శ్రీనివాసులు మాట్లాడుతూ కార్మికులు తమ హక్కుల సాధన కోసం సంఘటితంగా ఉండాలని అన్నారు. చర్లపల్లి ఇండస్ట్రియల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు బి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కె.ఎస్.ఎస్.మణికంఠ, రవీందర్‌రెడ్డి, అశోక్‌గౌడ్, ఖాజా, రమేష్, యూనియన్ నాయకులు శంకర్, నరేందర్, దినేష్, రాజు, శ్రీరామ్, బాలు, కిరణ్ తదితరులు, కార్మికులు, లారీ యజమానులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)