అడ్వకేట్ రాములు నాయక్
నవతెలంగాణ-మిడ్జిల్
ఓటు అనే ఆయుధంతోనే దళిత, బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమవుతుందని అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు అడ్వకేట్ రాములు అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు, అడ్వకేట్ రాములు నాయక్ ఆధ్వర్యంలో 'ఓటు చైతన్య రథయాత్ర' గురువారం మిడ్జిల్ మండల కేంద్రంలో ఘనంగా ప్రారంభమైంది. ముందుగా స్థానిక డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాదయాత్ర ద్వారా ఈ చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా అడ్వకేట్ రాములు నాయక్ మాట్లాడుతూ. రాజ్యాంగం కల్పించిన అత్యంత శక్తివంతమైన ఓటు హక్కుపై దళిత, బహుజనులలో పూర్తిస్థాయి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటు విలువను వివరించాలని సూచించారు. రాబోయే రోజుల్లో దళిత, బహుజనులు కేవలం ఓటర్లుగానే మిగిలిపోకుండా, రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఉమ్మడి కల్వకుర్తి నియోజకవర్గం లోని, ఊరుకొండ, తలకొండపల్లి , ఆమనగల్, మాడుగుల, వెల్దండ, చారగొండ, వంగూర్, మండలాల్లోని ఆయా గ్రామాలలో యాత్ర కొనసాగుతుందని , అనంతరం కల్వకుర్తిలో భారీ సభ నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ పూలే జాతర రాష్ట్ర సలహాదారులు సుధాకర్, అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు బరిగల బాలయ్య, దళిత బహుజన రాష్ట్ర నాయకులు మావిళ్ల వెంకటయ్య , బిజెపి జిల్లా నాయకులు రాజేశ్వర్, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు దేవయ్య, బిజెపి మండల అధ్యక్షులు నరేష్ నాయక్, దళిత బహుజన నాయకులు బుచ్చయ్య, ఆంజనేయులు, మహనీయుల కళా మండలి రాష్ట్ర నాయకులు, శ్రీకాంత్ ,సాయిరాం, మహిళా కళాకారులు రేణుక , అలివేల,సువర్ణ ,మంగమ్మ,తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






కామెంట్లు (0)