Magazines

అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం

30 నిమిషాల క్రితం

Constitution Day
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

ఎంఆర్పిఎస్ నాయకులు సూర్యవంశం యాదవ్
నవతెలంగాణ-మద్నూర్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, భావితరాలకు రాజ్యాంగ స్ఫూర్తిని అందించాలని, జుక్కల్ నియోజకవర్గం ఎంఆర్పిఎస్ నాయకులు సూర్యవంశం యాదవ్ మాదిగ పిలుపునిచ్చారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని ఆయన గురువారం మద్నూర్ మండలంలోని మేనూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని గౌరవిద్దాం.. హక్కులను కాపాడుదాం.. బాధ్యతలను నెరవేరుద్దాం.. సమానత్వం సోదరి భావంతో కూడిన స్ఫూర్తిని బలమైన భారత దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించగా 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు విజయ్, పెద్దలు రమేష్ దేశాయ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్