Magazines

పాఠశాలలను సందర్శించిన డీఈవో

16 నిమిషాల క్రితం

DEO visits schools
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - అశ్వారావుపేట

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల ప్రభావంతో పాఠశాలల పరిస్థితులను జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) శంభు ప్రసాద్ పరిశీలించారు. అశ్వారావుపేట మండలంలోని పలు పాఠశాలలను గురువారం సందర్శించి అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.


ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పలు పాఠశాలల్లోకి నీరు చేరడంతో పాటు పాఠశాల ఆవరణలు బురదమయంగా మారాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మండలంలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. సెలవులు ఉన్నప్పటికీ పాఠశాల భవనాల పరిస్థితి, ఆవరణలో ఏర్పడిన పరిస్థితులు, వరద నీటి ప్రభావం తదితర అంశాలను డీఈవో పరిశీలించారు.


విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో ఏవైనా ఇబ్బందికరమైన పరిస్థితులు, భవనాలకు నష్టం లేదా ఇతర సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని మండల విద్యాశాఖ అధికారికి సూచించారు. అనంతరం అశ్వారావుపేట మండల విద్యాశాఖ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట, దమ్మపేట మండల విద్యాశాఖ అధికారులు పి. ప్రసాద్‌రావు, జగపతి, సీఆర్‌పీ ప్రభాకరాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్