Magazines

గుమ్మడవల్లి పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌ఓ

10 నిమిషాల క్రితం

Gummadavalli PHC
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

- రికార్డుల పరిశీలనలో పలు లోపాల గుర్తింపు

- లక్ష్యాలు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశం

నవతెలంగాణ – అశ్వారావుపేట

గుమ్మడవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ తుకారాం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వహణ, వివిధ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి పలు లోపాలను గుర్తించారు.

ఈడీడీ క్యాలెండర్‌ను సకాలంలో అప్‌డేట్ చేయకపోవడం, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ పురోగతి 50 శాతం కంటే తక్కువగా ఉండటం, గర్భిణీ స్త్రీల ఏఎన్‌సీ రిజిస్ట్రేషన్ 70 శాతం కంటే తక్కువగా ఉండటాన్ని ఆయన గమనించారు.


అనంతరం నిర్వహించిన ఆశా డే సమావేశంలో పాల్గొన్న డీఎంహెచ్‌వో డాక్టర్ తుకారాం ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెండింగ్‌లో ఉన్న ఈడీడీ క్యాలెండర్‌ను వెంటనే అప్‌డేట్ చేయాలని, గర్భిణీ స్త్రీలందరికీ ఏఎన్‌సీ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే హెచ్‌పీవీ టీకాల లక్ష్యాన్ని త్వరితగతిన సాధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, నిర్లక్ష్యం చేస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ నందిత పౌల్, ఆసుపత్రి సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్