Magazines

కొయ్యుర్ జిపిలో నిధుల దుర్వినియోగంపై కలెక్టర్ కు ఫిర్యాదు చెసిన ఉప సర్పంచ్ 

1 గంట క్రితం

Deputy Sarpanch lodges complaint with Collector regarding misappropriation of funds in Koyyuru GP
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

మండలంలోని కొయ్యుర్ గ్రామపంచాయతీలో రూ.2,38 లక్షల నిధుల దుర్వినియోగం జరుగుతోందని ఆరోపిస్తూ గ్రామ ఉపసర్పంచ్ లకావత్ సవేందర్ సోమవారం జిల్లా కలెక్టర్‌ రాహుల్ శర్మకు ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు... గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ,పంచాయతీ కార్యదర్శి పంచగిరి రాజు గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేస్తూ,తప్పుడు లెక్కలు చూపించి నిధులను వ్యక్తిగత ఖర్చులకు వినియోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలిపారు. గ్రామ పంచాయతీ రికార్డులపై ఉపసర్పంచ్ హోదాలో తన సంతకం చేయాల్సి వస్తోందని, అయితే నిధుల వినియోగంపై అనుమానాలు ఉండటంతో తప్పుడు లెక్కలుగా భావిస్తున్న రికార్డులపై సంతకం చేయడానికి నిరాకరించినట్లు తెలిపారు. సంతకం చేయకపోతే ఉపసర్పంచ్ పదవి తొలగిపోతుందని బెదిరిస్తూ తనపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. నిధుల వినియోగంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని, గ్రామ పంచాయతీ రికార్డులు,నోట్ ఫైళ్లు, బిల్లులు,చెల్లింపులను పరిశీలించాలని విన్నవించారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని, తనపై జరుగుతున్న ఒత్తిళ్లు,బెదిరింపులపై విచారణ జరిపి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్