నవతెలంగాణ మహాదేవపూర్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఆదేశాల మేరకు మహాదేవపూర్ గ్రామంలోని జనగాం రమాదేవి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండుగ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ హసీనా బాను అక్బర్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన
ఈ పండుగ కార్యక్రమంలో పాస్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి ఉప సర్పంచ్, శ్రీజ సంతోష్ పాలకవర్గ సభ్యులు నల్ల బుగ్గ సమ్మయ్య పడాల మొగిలి అస్రార్ ఖురేషి మొహమ్మద్ బిన్ అలీ గడ్డం స్వామి కొండపల్లి రాములు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇర్షాద్ భాయ్ నల్ల బుగ్గ ధర్మయ్య రుక్సానా భాగ్య మాజీ వార్డ్ సభ్యులు ఉస్మాన్ ఖాన్ ఇందిరమ్మ ఇంటి కుటుంబ సభ్యులు ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని, నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంట్లో లక్ష్మీదేవి దివ్య ఆశీస్సులతో ఎల్లప్పుడూ సంతోషాలు, కొత్త వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ, సర్పంచ్ హసీనా బాను అక్బర్ ఖాన్ సదరు దంపతులకు నూతన వస్త్రాలను బహుకరించి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ హసీనా బాను అక్బర్ ఖాన్ మాట్లాడుతూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మార్గదర్శకత్వంలో ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే మా లక్ష్యం. ఈ కొత్త ఇల్లు ఆ కుటుంబంలో శాశ్వత వెలుగులను, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను నింపాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)