నవతెలంగాణ-ఆలేరు టౌన్
బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోతూ కూడా పదిమందికి తన అవయవాలను దానం చేసి, అందరి దృష్టిలో చిరంజీవిగా నిలిచిన జూకంటి కుమార్ 2వ వర్ధంతిని పట్టణంలో నిర్వహించారు. ఈ మేరకు గురువారం రైల్వే గేట్, అమరవీరుల స్థూపం, బస్ షెల్టర్ వద్ద
తోటి స్నేహితులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేశారు. కార్యక్రమంలో స్నేహితులు కటకం నవీన్, గాండ్ల సంపత్, కటకం బాలరాజు, ఆనందు, వెంకటేశు, వైకుంఠం, రాజు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)