నవతెలంగాణ - యాలాల
ద్విచక్ర (టీజి 06 బీ 6974) వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన గురువారం యాలాల మండలం దౌలాపూర్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలతో పాటు ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.






కామెంట్‌లు (0)