నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి సావిత్రి దేవి (91) కన్నుమూశారు. ఉత్తరాఖండ్‌లోని పౌరీ గఢ్వాల్ జిల్లాలో ఉన్న తమ స్వగ్రామం పంచూర్‌లోని నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. వయోభారం, ఇతర అనారోగ్య సమస్యలతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సావిత్రి దేవి మరణవార్తను పౌరీ గఢ్వాల్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) సర్వేశ్ పన్వార్ ధ్రువీకరించారు. ఆమె భౌతికకాయానికి రేపు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఈ విషయమై పోలీసు, స్థానిక జిల్లా యంత్రాంగం కుటుంబ సభ్యులతో సమన్వయం చేసుకుంటోందని పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తల్లి కన్నుమూత..
14 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)