Magazines

రచయితల సంఘం రాష్ట్ర కోశాధికారిగా డా. పోరెడ్డి రంగయ్య

7 గంటల క్రితం

Poreddy Rangaiah
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌను 

తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర కోశాధికారిగా ఆలేరు పట్టణానికి చెందిన కవి, ఉపాధ్యాయుడు డాక్టర్ పోరెడ్డి రంగయ్యను ఎంపిక చేసినట్లు, తెరసం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాళేశ్వరం శంకరం, ప్రధాన కార్యదర్శి పొట్లపల్లి శ్రీనివాస రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 


ఈ ఎంపిక సమావేశంలో తెరసం వ్యవస్థాకుడు ప్రముఖ సాహితీ వేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిధారెడ్డి, పూర్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి.శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ తూర్పు మల్లారెడ్డి, జంటనగరాల శాఖ అధ్యక్ష కార్యదర్శులు కందుకూరి శ్రీరాములు, బెల్లంకొండ సంపత కుమార్ తదితరులు పాల్గొన్నారు.


డాక్టర్ పోరెడ్డి రంగయ్య గత మూడు దశాబ్దాలుగా తెలుగు సాహిత్య రంగానికి సేవలు అందిస్తూ వస్తున్నాడు. తేజ సాహిత్య సేవా సంస్థకు, యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘానికి అధ్యక్షుడుగా ఉంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఆలేరు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. డాక్టర్ పోరెడ్డి ఎంపిక పట్ల తెరసం కార్యవర్గ సభ్యులు, ఆయా జిల్లాల బాధ్యులు, యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘం, ప్రజాభారతి, ఆత్మీయ భారతి తదితర సంస్థల బాధ్యులు అభినందనలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్