నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని ఎంపీయూపీఎస్ రామన్నగూడెం పాఠశాలలో ముందస్తు బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మచ్చ సోమయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించి క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించామని పేర్కొన్నారు. ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల విజేతలకు బహుమతులు అందజేశామని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పరిదుల వెంకటేశ్వర్లు, దాసరి యాదగిరి, బొమ్మల బోయిన రమేష్, ముత్యం సునీల్, తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)