నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని మునగలవీడు గ్రామంలో ఐసీడీఎస్ నెల్లికుదురు సెక్టర్ పరిధి మునిగలవీడు గ్రామస్థాయి బాలికల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసినట్టు గ్రామ సర్పంచ్ బొల్లికొండ చైతన్య నాగరాజు, సెక్టార్ సూపర్వైజర్ ఎన్ సరిత తెలిపారు. గురువారం 15మందితో కూడిన వీసీపీసీ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామ స్థాయిలో పిల్లలపై జరిగే నేరాలను నియంత్రించేందుకు కమిటీ ఉపయోగపడుతుందని అన్నారు.
పిల్లల చట్టాలపై అహగహన కల్పించడానికి, తల్లిదండ్రులకు అహగహన కల్పించడానికి ఉపయోకరంగా ఉంటుందని అన్నారు. బాల్య వివాహాల నిర్మూళనకు పాటుపడాలని అన్నారు. శారీరక మానసిక వేధింపుల నుండి సంరక్షణకు, బాలలతో భిక్షాటన, బాలల పట్ల లింగ వివక్ష రూపుమాపేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సర్పంచ్ బొల్లికొండ చైతన్య చైర్మన్ గా వ్యవహరిస్తారని అన్నారు. కన్వీనర్ గా అంగన్‌వాడీ టీచర్ బి వీరలక్ష్మి, 15 సభ్యులతో కమిటీ ఎన్నుకున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వప్న, ఎన్జీవో సోమన్న, పంచాయతీ కార్యదర్శి వెంకన్న, వీ పి ఓ యాకయ్య, అంగన్‌వాడీ టీచర్లు వీరలక్ష్మి, జమాల్బి, మహతి, సరోజిని, ఆశ భవాని, కౌసల్య, తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)