ప్రధానోపాధ్యాయుడు మచ్చ సోమయ్య
నవతెలంగాణ-నెల్లికుదురు
ప్రభుత్వ పాఠశాల చదువుతున్న ప్రతి విద్యార్థి ఉన్నంత స్థాయికి ఎదగాలంటే విద్యార్థులు తల్లిదండ్రుల ఉపాధ్యాయులకు సహకరించాలని కోరినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మచ్చ సోమయ్య తెలిపారు. గురువారం రామన్నగూడెం ఎంపీయూపీఎస్ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించారు.
ప్రధానోపాధ్యాయులు మచ్చ సోమయ్య మాట్లాడుతూ..పిల్లలకు ఎఫ్ఏ-1, ఎఫ్ఏ-2, ఎస్ఏ పరీక్షల ఫలితాలకు సంబంధించి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ తల్లిదండ్రులకు అందజేసినట్టు చెప్పారు. విద్యార్థుల ప్రగతిలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు బాధ్యత వహించాలని కోరారు. ప్రభుత్వం ఉచిత పుస్తకాలు, నోటు బుక్స్, షూస్ , బెల్టు, పోషక పదార్థాలతో కూడిన ఆహారం అందిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో సహోపాధ్యాయులు బాతుక బుచ్చిరామయ్య, పరీధుల వెంకటేశ్వర్లు, దాసరి యాదగిరి, బొమ్మెన బోయిన రమేష్ , ముత్యం సునీల్, తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)