Magazines

జోగిపేట ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్

4 గంటల క్రితం

Food poisoning
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

ఏడుగురు బాలికలకు అస్వస్థత
నవతెలంగాణ- జోగిపేట

ఫుడ్‌ పాయిజన్‌తో ఏడుగురు బాలికలు అస్వస్థతకు గురైన ఘటన జోగిపేట ఎస్సీ బాలికల హాస్టల్ లో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఉదయం హాస్టల్లో వండిన పులిహోర తిన్న కొద్దిసేపటికి వాంతులు, విరేచనాలయ్యాయని చెప్పారు. హాస్టల్‌ లోని మిగతా విద్యార్థినిలు ప్రిన్సిపల్ సబిత దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ప్రిన్సిపల్‌ బాలికలను జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు.


ఘటనపై విద్యార్థులు స్పందిస్తూ.. హాస్టల్ లో పనిచేసే సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తూ, ఇష్టానుసారంగా వంటలు చేస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న జోగిపేట ఆర్డీవో రమేష్ బాబు, తహసిల్దార్ మధుకర్ రెడ్డి, ఎస్సై గిరి శ్రీకాంత్ లు హాస్టల్ కి వెళ్లి వివరాలు సేకరించారు.


ఆస్పత్రికి కూడా వెళ్లి మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ అఖిలేష్ రెడ్డి ఆస్పత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం బాగానే ఉందని, అపాయం ఏమీ లేదని డాక్టర్లు ఆయనకు తెలిపారు. ఫుడ్ పాయిజన్‌కు సంబంధించి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని అఖిలేష్ రెడ్డి పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్