నవతెలంగాణ-కుభీర్
ముధోల్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బోస్లే నారాయణ్ రావు పటేల్ జన్మదిన వేడుకలను స్థానిక నాయకులు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రమైన కుభీర్ వివేకానంద విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బషీర్ పార్టీ నాయకులతో కలసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్బంగా మండలాధ్యక్షులు బషీర్, డిసిసి కార్యదర్శి పురంశెట్టి రవికుమార్ మాట్లాడుతూ.. ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావు పటేల్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ది పనులను పథకాలు ప్రజలకు అందించేందుకు ప్రతీ కార్యకర్త కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు బంక బాబు, శివాజీ, క్రాంతి చవాన్, ఆయా గ్రామాల సర్పంచులు మాజీ ఎంపీటీసీలు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.





కామెంట్లు (0)