Magazines

ఇందిరమ్మ బీమాను సద్వినియోగం చేసుకోవాలి

33 నిమిషాల క్రితం

Indiramma Insurance
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

- సర్పంచ్ బండారు కవిత స్వామి గౌడ్

నవతెలంగాణ - తొగుట

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ బండారు కవిత స్వామి గౌడ్ తెలిపారు. గ్రామ పంచాయతీలో జరుగుతున్న బీమా నమోదు కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. 18-59 ఏండ్ల వయస్సు కలిగిన కుటుంబంలోని సంపాదించే ఒక వ్యక్తికి రూ.5 లక్షల జీవిత బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.


ఈ బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, లబ్ధిదారులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు కేవలం 150 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారనీ, మిగిలిన వారందరూ నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకు తమ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నంబరుతో గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చి బీమా నమోదు చేసుకోవాలని సూచించారు.


రేషన్ కార్డు ఈ - కేవైసీ పూర్తి చేసుకోవాలని, బీమా పొందే వ్యక్తి తన నామినీ వివరాలను కూడా నమోదు చేయించుకోవాలని తెలిపారు. డిసెంబర్ 18వ తేదీలోగా నమో దు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో కార్యదర్శి సుతారి రవీందర్, వార్డు సభ్యులు జహంగీర్, నాయకులు కత్తుల రమేష్ అంగన్వాడీ టీచర్లు ఫీల్డ్ అసిస్టెంట్ కళ్లెపు నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్