Magazines

బాల్య మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం

25 నిమిషాల క్రితం

Financial assistance
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-కడ్తాల్ 

మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన ఉడుతల శంకర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న 2002-03 పదవ తరగతి ముద్విన్ జిల్లా పరిషత్ పాఠశాలలో చదివిన విద్యార్థులు తన చిన్ననాటి స్నేహితుడు మృతి చెందడంతో స్నేహితుని కుటుంబానికి అండగా నిలవాలన్న ఉద్దేశంతో గురువారం శంకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.


అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, భార్య పద్మకు రూ.31 వేలు ఆర్థిక సాయం అందజేశారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. శివ డిగ్రీ చదువుతున్నారు. బన్నీ పదవ తరగతి చదువుతున్నారు. పిల్లలపై చదువుకు బాల్య మిత్రులు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో అండగా ఉంటామని బాల్య మిత్రులు తోడుగా ఉంటానన్నారు.


కార్యక్రమంలో బైరమోని వెంకటేష్, రాసిక శ్రీను, పాలకూర ఆంజనేయులు, పాల కుర్ల మల్లేష్, గంగ మహేష్, జయేందర్, నరసింహ, పాండు, మల్లేష్, వెంకటేష్, శేఖర్, వెంకటయ్య, ఆనంద్, మల్లేష్, శ్రీశైలం, ముత్యం, కృష్ణ ,కుమార్, సురేష్, నవీన్, హరికృష్ణ, బ్రహ్మచారి, జంగయ్య, అంజయ్య, వెంకటేశ్వర్లు, రాజు, బాల్యమిత్రులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్