Magazines

రేపు ఇండియా బ్లాక్ కూటమి కీలక భేటీ

25 నిమిషాల క్రితం

Crucial meeting of the INDIA bloc tomorrow
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నేపథ్యంలో ఇండియా బ్లాక్ కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం(రేపు) ఉదయం 11.30 గంటలకు సమావేశమవుతామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం తెలిపారు. తమ వ్యూహాన్ని చర్చించి, తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఉభయ సభల్లో డీలిమిటేషన్ ప్రక్రియపై చర్చ సందర్భంగా వ్యవహరించాల్సిన తీరుపై ప్రధానంగా చర్చలు సాగుతాయని తెలిపారు.ప్రధాని మోడీ, హోం మంత్రి షా భారత ప్రజలకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఉచ్చు పన్నాలని చూస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న కుట్ర ఇదే," అని ఆయన ఆరోపించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్