ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ
నవతెలంగాణ-నెల్లికుదురు
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏదేళ్ల యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల మాజీ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా, మండల నాయకులు మాట్లాడుతూ... పార్టీ అభివృద్ధి కోసం, ఏ ఎన్నికలు వచ్చినా అభ్యర్తుల గెలుపు కోసం కృషి చేసే వ్యక్తి మండల అధ్యక్షుడు యాదవ రెడ్డి అని కొనియాడారు.
సొంత డబ్బులు వెచ్చించి అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. గ్రామం, మండలం, జిల్లా స్థాయిలో కూడా కీలక పాత్ర పోషించినట్టు చెప్పారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి యాదవరెడ్డి అన్నారు. మహబూబాబాద్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు ఎదెళ్ల యాదవ రెడ్డి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు సర్పంచులు, పులి వెంకన్న, నాయకులు శ్రీనివాస్ అశోక్, గుండెబోయిన అశోక్ నాయక్, వాసు, కత్తుల యాకాంతం, నలమాస శ్రీనివాస్, రావుల సతీష్, మద్ది రాజేష్, పట్నం శెట్టి నాగరాజు, అమ్రు నాయక్, భాస్కర్ నాయక్, గుగులోతు సోమన్న, వారిపల్లి పూర్ణ, బెల్లి నరసయ్య, గుదే యుగేందర్, గోవర్ధన్ రెడ్డి, బాలాజీ నాయక్, తాళ్లపల్లి వెంకన్న, ఇట్టే దేవేందర్ రెడ్డి, వలబోజు వెంకటేశ్వర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు






కామెంట్‌లు (0)