Magazines

గుమ్మకొండ మధుసూదన్ రెడ్డి సేవలు ఆదర్శనీయం 

5 రోజుల క్రితం

Gummakonda
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

• సర్పంచ్ వీరమల్ల శిరీష లోకేష్ గౌడ్ 

నవతెలంగాణ-మర్రిగూడ 

సొంతూరి అభివృద్ధి కోసం ఆస్తులే విరాళంగా ఇచ్చిన మండల కేంద్రానికి చెందిన ఎన్నారై గుమ్మకొండ మధుసూదన్ రెడ్డి సేవలు సమాజానికి ఆదర్శనీయమని మర్రిగూడ గ్రామ సర్పంచ్ వీరమల్ల శిరీష లోకేష్ గౌడ్ అన్నారు. మధుసూదన్ రెడ్డి సేవలను గుర్తిస్తూ గురువారం ఘనంగా సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాభివృద్ధి, ఆధ్యాత్మిక సేవలకు కోట్లాది రూపాయల విలువైన భూములు అందజేశారని, విదేశాల్లో స్థిరపడినప్పటికీ గ్రామంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ తన సొంత ఇంటి స్థలాన్ని గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం, మండల కేంద్రంలోని 22 ఎకరాల భూమిని గ్రామ భారతి కోసం అందజేసి గ్రామాభివృద్ధికి తన వంతు సహకారం అందించారని గుర్తు చేశారు.


అంతేకాకుండా గ్రామ ప్రజల ఆధ్యాత్మిక ఆకాంక్షలకు అనుగుణంగా శివాలయ నిర్మాణం కోసం 1.50 కోట్ల వ్యయంతో ఆలయ నిర్మాణానికి సహకరించారని, రంగారెడ్డి జిల్లా మాల్ ప్రాంతంలో తనకు ఉన్న 20 ఎకరాల భూమిని శ్రీకృష్ణ భగవానుని సేవలో నిమగ్నమైన హరేకృష్ణ సంస్థకు విరాళంగా అందజేసి తన దాతృత్వాన్ని, ఆధ్యాత్మిక సేవాభావాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సేవాభావం కలిగిన దాతల సహకారం గ్రామాల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఆయన విశేష సేవలను గుర్తిస్తూ సర్పంచ్ తో పాటు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించి అభినందనలు జరిగిందని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్