- విద్యార్థుల మధ్య ఘర్షణ తలకు బలమైన గాయం
- ప్రాణాపాయ స్థితిలో ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి
నవతెలంగాణ-బోడుప్పల్: విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఓ విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చిన ఘటన బోడుప్పల్ శ్రీ చైతన్య కళాశాలలో బుధవారం రాత్రి జరిగింది. గాయపడిన విద్యార్థి బందువులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామానికి చెందిన కె.సనుదీప్ (17)బోడుప్పల్ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.బుధవారం రాత్రి కళాశాల హాస్టల్ లోని నలుగురు విద్యార్థుల మద్య ఘర్షణ జరిగింది అందుకో అనుదీప్ కు తలకు బలమైన గాయాలై స్పృహ తప్పి కింద పడిపోవడంతో కళాశాల యాజమాన్యం సమీపంలోని ప్రయివేటు హస్పిటల్ లో చేర్పించారు.ప్రస్తుతం గాయపడిన విద్యార్థి ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు.కాగ విషయం తెలుసుకున్న మేడిపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని జరిగిన ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని మేడిపల్లి సీఐ డి.జలంధర్ రెడ్డి తెలిపారు. కాగా కుటుంబ సభ్యులు కళశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఎండీ అన్వర్ విచారం వ్యక్తం చేస్తూ కళశాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






కామెంట్‌లు (0)