నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునే లక్ష్యంతో నవంబర్ 1న న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించనున్న 'చలో ఢిల్లీ' మార్చ్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఎంపీ రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇవాళ ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇది కేవలం రాజకీయ పార్టీకి సంబంధించినది కాదని, ఓట్ చోరీని అడ్డుకోవడానికి జరుగుతున్న పోరాటమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, ప్రజాస్వామ్య ప్రేమికులు ఎటువంటి భయం లేకుండా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
నవంబర్ 1న చలో ఢిల్లీ మార్చ్: రాహుల్ గాంధీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)