Magazines

మంజీరాలో తగ్గిన నీటిమట్టం..పంట పొలంలోకి మొసలి

1 గంట క్రితం

Crocadile
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఎంకేపల్లి గ్రామ శివారులోని పంట పొలంలో మొసలి కనిపించడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. వనదుర్గ భవానీ ప్రాజెక్టు, మంజీరా పరిసరాల్లో నీటిమట్టం తగ్గడంతో మొసలి పొలంలోకి వచ్చినట్లు స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంగారెడ్డి నుంచి రెస్క్యూ టీమ్‌ను రప్పించారు. రెస్క్యూ టీమ్ మొసలిని సురక్షితంగా పట్టుకుని తరలించింది. మంజీరా పరిసరాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని, మొసలి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్