రాష్ట్ర యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శి కొనసాగుతున్న కేశని మహేష్
నవతెలంగాణ - కడ్తాల్
కడ్తాల్ మండలానికి జడ్పీటీసీ ఎన్నికల్లో బీ సీ రిజర్వేషన్ వస్తే బీఆర్ఎస్ పార్టీ తనకు అవకాశం ఇస్తే జడ్పీటీసీ బరిలో ఉంటానని కడ్తాల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శి కేశని మహేష్ ముదిరాజ్ ( హెచ్ ఆర్) అన్నారు. బీటెక్ పూర్తి పూర్తిచేసి, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేశానని మహేష్ తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమకారులు ఠాకూర్ బాలాజీ సింగ్ వెంట ఉద్యమంలో పని చేశానని గుర్తు చేశారు.
2012 సంవత్సరంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎర్రోళ్ల శ్రీను, గాయకుడు సాయి చందు, అత్యంత సన్నిహితంగా ఉండి ఉద్యమంలో పాలుపంచుకున్నారు. ముదిరాజ్ హక్కుల కోసం ఉద్యమించారు. ముదిరాజుల సంఘంలో చురుకైన పాత్ర పోషించారు. 9 సంవత్సరాలుగా బీసీ యువజన సంఘం అధ్యక్షులుగా పని చేశారు. కడ్తాల్ గ్రామానికి 2019 నుండి 2024 వరకు వార్డు సభ్యులు సేవలందించారు. బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీలో యువ నాయకునిగా చురుకైన పాత్ర పోషిస్తారు. పార్టీ కార్యక్రమాలలో ముందుంటారు. బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావుతో అత్యంత సన్నిహితంగా మహేష్ ఉంటారని పార్టీ వర్గాలలో చర్చ నడుస్తుంది. పార్టీ అవకాశం ఇస్తే జడ్పీటీసీ బరిలో ఉండి భారీ మెజార్టీతో గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.





కామెంట్‌లు (0)