Magazines

సౌండ్‌ ఎక్విప్‌మెంట్‌ స్వాధీనం.. నిందితుల అరెస్టు

15 నిమిషాల క్రితం

Sound equipment
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ–రాయపోల్

దొంగతనం కేసులో నిందితుడిని రాయపోల్ పోలీసులు అరెస్టు చేసి, అతని వద్ద నుంచి సుమారు రూ.98 వేల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు రాయపోల్ ఎస్ఐ బి. లింగం తెలిపారు. ఆదివారం రాయపోల్ మండలం తిమ్మక్ పల్లి వద్ద మధ్యాహ్నం 2:00 గంటల సమయంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఎస్ఐ బి.లింగం తన సిబ్బందితో కలిసి నిందితుడిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తరచూ చేసే వాహనాలు తనిఖీలో భాగంగా తిమ్మక్ పల్లి గ్రామం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడు శివాయిపల్లి గ్రామం, రామాయంపేట మండలం మెదక్ జిల్లాకు చెందిన అమ్మోళ్ల బ్రహ్మ (19) వ్యక్తిగా గుర్తించినట్లు తెలిపారు. గతంలోనూ దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చినట్లు వెల్లడించారు.


నిందితుడి వద్ద నుంచి సీసీ కెమెరా, రెండు బేస్ స్పీకర్లు,నాలుగు టాప్ స్పీకర్లు, ఒక టాప్ మెషిన్, ఒక బేస్ మెషిన్, క్రాస్ ఓవర్, మౌత్ పీస్, కేబుల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.98 వేలు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే దొంగతనానికి ఉపయోగించిన రెండు స్క్రూ డ్రైవర్లు, ఒక ఇనుప రాడ్‌తో పాటు నిందితుడి ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ బి. లింగం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్స్ ఆంజనేయులు గౌడ్, జీవయ్య, పోలీస్ సిబ్బంది మనోజ్, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్