Magazines

కాలేశ్వరం నీటిని వినియోగించుకోలేని అసమర్థ ప్రభుత్వం

33 నిమిషాల క్రితం

Vardannpet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

- ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు 

నవతెలంగాణ-వర్ధన్నపేట : దేవాదుల చివరి ఆయకట్టు కు నిరంధించాలని, పూడికతో కురుకుపోయిన కాలువను మరమ్మత్తు చేసి సాగునీరు అందించాలని ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు అన్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ రవీందర్ రావు ను స్థానిక సర్పంచ్ గ్రామస్తులు రైతులు కలిసి దేవాదుల నీరు అందడం లేదని విన్నవించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రవీందర్ రావు నీటిపారుదల శాఖఅధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి రైతులకు  దేవాదుల డి-9 కాలువ ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల వ్యవసాయ సమస్యలపై సరైన అవగాహన లేదని, రైతుల ఉసురు తగులుతుందని అన్నారు. కేసీఆర్ హయాంలో పండుగలా ఉన్న వ్యవసాయం నేడు దండగగా మారిందని వ్యాఖ్యానించారు. కాలేశ్వరం నీటిని వినియోగించుకోలేని అసమర్థత ప్రభుత్వానికి ఉందని విమర్శించారు. కాలేశ్వరం నీటిని ఎత్తిపోసి వెంటనే ఎస్సారెస్పీ, దేవాదుల కాలువల ద్వారా రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బెతి సాంబయ్య పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్