Magazines

మదర్ సాహెబ్ దర్గా ఉర్సు ఉత్సవాలు..

25 నిమిషాల క్రితం

aleru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌను :  మదర్ సాహెబ్ దర్గా ఉర్సు ఉత్సవాలు,  ఈనెల 6వ తేదీన శుక్రవారం నిర్వహించానున్నట్లు, దర్గా ముతవళి, హజ్రత్ మదర్ హుస్సేన్ అలీ, అలియాస్ బీజన మధు కుమార్ ఆలేరు పట్టణ బుధవారం విలేకరులకు ఒక ప్రకటనలో తెలియజేశారు.

 శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటలకు పట్టణంలోని కాటమయ్య నగర్  నివాసం నుండి, దర్గా వరకు గంధం ఊరేగింపు నిర్వహించనున్నట్లు చెప్పారు.

 సాయంత్రం 6 గంటలకు డఫ్ బృందం చే కావ్వలి  నిర్వహించినట్లు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం చిరాగా దీపారాధన నిర్వహించనున్నట్లు చెప్పారు.

 ముఖ్య అతిథులుగా దర్గా గౌరవ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్, ఉమ్మడి నల్లగొండ వరంగల్ ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీమంత్రి , సూర్యాపేట ఎమ్మెల్యే, గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే  పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ, చైర్మన్ బండ్రు శోభారాణి, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి హాజరుకానున్నట్లు తెలియజేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అన్ని రకాల  సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్