Magazines

సత్తుపల్లికి మురసు' తుఫాను.. నీట మునిగిన వరి పంటలు

21 నిమిషాల క్రితం

'Murasu' storm hits Sathupalli; paddy crops submerged
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 2 నిమిషాల చదవడం

- అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం

నవతెలంగాణ-సత్తుపల్లి 

​'మురసు' తుఫాను ప్రభావంతో సత్తుపల్లి ప్రాంతంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి.​మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో సత్తుపల్లి మండలం వ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ​మండలంలోని పలు ప్రాంతాల్లో రహదారులు వరద నీటితో పూర్తిగా దిగ్బంధమయ్యాయి. ​కిష్టారం - యాతాలకుంట, రుద్రాక్షపల్లి - నాచారం మార్గాల్లో రాకపోకలు నిలిచాయి. ​సత్యనారాయణపురం, గంగారం - రామానగరం తదితర గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ప్రమాదకరంగా మారిన ఈ రహదారులపై సీఐ తుమ్మలపల్లి శ్రీహరి ఆధ్వర్యంలో పోలీసులు కాపలా కాశారు. ​వరద ఉధృతి తగ్గే వరకు ఎవరూ ప్రయాణించవద్దని పోలీసులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ​మరోవైపు, చేతికొచ్చిన పంటలు నీట మునగడంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సత్యనారాయణపురం గ్రామంలో సుమారు 150  ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్లు గ్రామస్తులు తెలిపారు. ​కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ అకాల వర్షం రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.


సత్తుపల్లి పట్టణంలో పొంగి పొర్లిన డ్రైనేజీలు

​సత్తుపల్లి పట్టణంలో మురుగునీటి పారుదల వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ​పట్టణంలో డ్రైనేజీలు పొంగిపొర్లి రోడ్లపైకి మురుగునీరు భారీగా చేరింది. ​మున్సిపల్ కమిషనర్ కొండ్ర నరసింహ, కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ కమల్ పాషా వర్షంలోనూ ​డ్రైనేజీలను క్లియర్ చేసే పనులను వారు దగ్గరుండి పర్యవేక్షించారు. సిద్ధారం రోడ్డు నుంచి రాజీవ్‌నగర్ వెళ్లే రహదారి పూర్తిగా వాగును తలపించింది. ​ఈ మార్గంలో రాకపోకలు నిలిపేందుకు పోలీసులు ట్రాక్టర్లను అడ్డం పెట్టారు. ఎమ్మార్ గార్డెన్ వైపు రాజీవ్‌నగర్ ఎంట్రన్స్‌లో రోడ్డుకు ఇరువైపులా రాకపోకలను నిలువరించారు. ​పట్టణ పరిధిలోని కాకర్లపల్లి రోడ్డు, శివసాయి నగర్ ప్రాంతాల్లోనూ వరి చేలు నీట మునిగాయి. అధికార యంత్రాంగం, పోలీసుల సమన్వయంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టారు. ​ఎడతెరిపిలేని వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

'Murasu' storm

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్