నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఖమ్మంపాటి కాంతారావు నియమితులయ్యారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ సమక్షంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ... సత్తుపల్లి పట్టణంలోని కాంగ్రెస్ శ్రేణులందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి అంకితభావంతో కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి గడపకూ తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించేలా ఇప్పటి నుంచే పనిచేస్తామని స్పష్టం చేశారు. తనపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించిన ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్, డాక్టర్ దయానంద్ విజయకుమార్, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తన నియామకానికి సహకరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, వైస్ చైర్‌పర్సన్ బొంతు సుమలత వేణులకు కాంతారావు కృతజ్ఞతలు తెలిపారు.







కామెంట్‌లు (0)