Magazines

నెల రోజుల్లో సత్తుపల్లికి 'గోదావరి' జలాలు

17 అక్టోబర్, 2026

sattupally
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 2 నిమిషాల చదవడం

- ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి

- ఎంపీ, ఎమ్మెల్యే ఎస్ఆర్ఎల్పీ యాతాలకుంట టన్నెల్ పరిశీలన

- యాతాలకుంటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

నవతెలంగాణ-సత్తుపల్లి

 సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని సత్తుపల్లి మండలం యాతాలకుంట సొరంగ మార్గ కాలువ (టన్నెల్)ను ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి శనివారం ​సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి ఆయన ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు.

​అనంతరం యాతాలకుంటలోని ఎస్ఆర్‌ఎల్పీ క్యాంపు కార్యాలయంలో ఎంపీ రఘురాం రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఎస్ఆర్‌ఎల్పీ ప్రాజెక్టు పనులు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయన్నారు.


కాలువ నిర్మాణంలో 1,100 మీటర్ల రివెట్‌మెంట్ లైనింగ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన 600 మీటర్ల పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తి కావాల్సి ఉందన్నారు. ​మరో నెల రోజుల్లో ఈ పనులన్నీ పూర్తయి, గోదావరి జలాలు సత్తుపల్లి ప్రాంతానికి చేరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ​ప్రాజెక్టు పనులు ప్రస్తుతం చాలా చురుగ్గా, వేగంగా సాగుతున్నాయని ఎంపీ స్పష్టం చేశారు.


​పనుల నిర్వహణకు సంబంధించి రైతుల భూములు కానీ, అటవీ భూముల సమస్యలు కానీ ఏమీ లేవని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ​రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ​ఏఎంసీ ఛైర్మన్ దోమ ఆనంద్ బాబు, నాయకులు గాదె చెన్నకేశవరావు, మొహమ్మద్ కమల్ పాషా, నరుకుళ్ల అప్పారావు, యాతాలకుంట సర్పంచ్ తాటి ఈశ్వరి, ఉపసర్పంచ్ బట్టు మధుసూధనరెడ్డి పాల్గొన్నారు. 


స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎంపీ,  ఎమ్మెల్యే

సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. కొత్తగా 46 రేషన్ కార్డులు  మంజూరు కాగా ఇంతకు ముందు ఉన్న వాటితో కలిపి మొత్తం గ్రామంలో 363 కార్డులకు చేరాయని ఎంపీ, ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ సర్పంచ్ తాటి ఈశ్వరి ఉపసర్పంచ్ బట్టు మధుసూధనరెడ్డి, నాయకులు గాదె చెన్నకేశవరావు, మొహమ్మద్ కమల్ పాషా, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, మోదుగు లక్ష్మీనారాయణ, పల్లె రామకృష్ణ, గంధం బాలకృష్ణ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్