Magazines

పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

57 నిమిషాల క్రితం

suicide
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - అశ్వారావుపేట

అశ్వారావుపేట మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన పొండ్రు దుర్గాప్రసాద్‌ (28) పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ కలహాల కారణంగా మృతుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిసింది.


ఈ నెల 13న ఉదయం దుర్గాప్రసాద్‌ పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అక్టోబర్‌ 18న ఉదయం మృతి చెందాడు.

మృతుడి భార్య పొండ్రు లోవలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశ్వారావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అదనపు ఎస్సై దేవ్ సింగ్ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్