Magazines

మూలవాసుల యోధుడు...!

57 నిమిషాల క్రితం

warrior
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం

కొండల్లో చిగురించిన వసంతం.. చీకటిలో రాజుకున్న నిప్పురవ్వ.. జమీన్ కోసం నినదించిన గొంతుక.. జాతి కోసం రగిలిన పోరాటం..! శ్రమ దోపిడీపై తిరుగుబాటు.. నిజాం అణచివేతపై సమరశంఖం.. శత్రు తూటాలకు నేలకొరిగినా.. అతడు ఆదీవాసీల జీవ గర్జన..! పచ్చని అడవే అతడి ఊపిరి.. జల్.. జంగల్.. జమీన్.. కోసమై ఆత్మగౌరవాన్ని ఆయుధంగా మలచిన మూలవాసుల యోధుడు కొమురం భీం..! నీ త్యాగం వెలుగుబాట.. నీ పోరు హక్కుల పాట.. నీ ఆవేదన అగ్నికణం.. నీ చరిత్ర తరతరాల చైతన్యం..! నీ జననం ఒక స్పూర్తి.. నీ త్యాగం మా చైతన్యం.. నీ పోరాటమే మా ప్రేరణ.. నీ ఆశయమే మా ఉద్యమం..! ( అక్టోబర్ 22 - మూలవాసుల యోధుడు కొమురం భీం పుట్టిన రోజు సందర్భంగా నివాళిగా..)
డా.వాసాల వరప్రసాద్, 9490189847

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్