నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన 'శివ నందు వ్లాగ్స్' నిర్వాహకుడు ఈర్ల శివను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సన్మానించారు. సత్తుపల్లిలోని ద్వారకాపురిలోని అధికారిక క్యాంపు కార్యాలయంలో గురువారం రాత్రి నిర్వహించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇన్ఫ్లుయెన్సర్లు రూపొందించే ప్రతి పది వీడియోలలో కనీసం రెండైనా సమాజానికి ఉపయోగపడేలా, చైతన్యపరిచేలా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం శివతో పాటు ఇతర సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)