Magazines

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ఆన్‌లైన్ కేంద్రం ఏర్పాటు

1 గంట క్రితం

MLC voters' registration
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయం దగ్గరలోని మీ-సేవ కేంద్రం ఎదుట శుక్రవారం గ్రాడ్యుయేట్ల సౌకర్యార్థం ఆన్‌లైన్ కేంద్రం ఏర్పాటైంది. ఈ ఆన్‌లైన్ ఓటరు నమోదు కేంద్రాన్ని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు, నాయకులు మొహమ్మద్ కమల్ పాషా, జిల్లా కార్యదర్శి దామెర రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అర్హులైన ప్రతీ ఒక్క పట్టభద్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని కోరారు.  కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుడ్లూరి రవి, కంభంపాటి కాంతారావు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్