- బతుకమ్మ వేడుకల్లో భారీ ఎత్తున పూలు పంపిణీ
- మహిళలకు చీరలు పంపిణీ
- ముఖ్య అతిథులుగా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ దంపతులు
- కోలాటాలు ఆడి, వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-సత్తుపల్లి
గంగారం గ్రామంలో ఆ గ్రామ అభివృద్ధి ప్రదాతలు దాసరి వెంకట్రామిరెడ్డి (చిట్టినాయన), రాజకుమారి దంపతుల ఆధ్వర్యంలో వారి కుమారుడు దాసరి మధుమోహనరెడ్డి (మధుబాబు) పర్యవేక్షణలో విజయదశమి సంబురాలు మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల కోసం మధుబాబు సౌజన్యంతో భారీ ఎత్తున పూలను పంపిణీ చేశారు. అలాగే బతుకమ్మ ఆటల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలందరికీ చీరలను అందజేశారు. ఈ సంబురాల కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పలు కాలనీల్లో నిర్వహించిన బతుకమ్మ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని మహిళలతో కలిసి ఉత్సాహంగా కోలాటాలు ఆడారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, గ్రామ సర్పంచ్ కాకర్ల రేవతి, రామగోవిందాపురం సర్పంచ్ మౌనిక రెడ్డి కాంగ్రెస్ నాయకులు కోలగట్ల చెన్నకేశవరావు, కావేటి అప్పారావు, బెజవాడ శ్రీనివాసరావు, బండారు మారేశ్వరరావు, కరాటే రమేష్, యామాల ముత్యాలరావు, కాకర్ల మాణిక్యాలరావు, జల్లిపల్లి వాసుదేవరావు, కోటమర్తి జవహర్ లాల్, చిన్ని వెంకటేశ్వరరావు, కాలసాని నాగేశ్వరరావు, రాచమళ్ల నాగేంద్రరావు, బండారు జగదీష్, కువ్వారపు కన్నయ్య, ఎస్కే సుభాని, కువ్వారపు గిరిబాబు, చల్లారి సత్యనారాయణ, కొండపల్లి మహేష్, బెజవాడ మనోజ్, మొగిలిచర్ల సత్యనారాయణ, మొగిలిచర్ల మోహనాచారి, నడ్డి రాంబాబు, వాడే మల్లేశ్వరరావు, సోయం కోటేశ్వరరావు పాల్గొన్నారు.






కామెంట్లు (0)